దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు..

నవతెలంగాణ – రాయపర్తి : వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తొర్రూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ బిఎస్ చారి, తదితరులు పాల్గొన్నారు.