కుక్కల దాడిలో జింక మృత్యువాత

నవతెలంగాణ – కొత్తూరు
మండలంలోని మక్తగూడ గ్రామ శివారులోని పంట పొలాల్లోకి వచ్చిన జింకను గురువారం కుక్కలు దాడి చేశాయి. కుక్కలు వెంబడించడంతో భయాందోళనకు గురైన జింక గ్రామంలోకి పరిగెత్తుకొని వచ్చింది. పసిగట్టిన గ్రామస్తులు కుక్కలను బెదిరించి జింకను తాడుతో కట్టి ఉంచారు. కొద్దిసేపటికి అది మృతి చెందింది. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బీట్ ఆఫీసర్ సంతోష్ సంఘటన స్థలానికి చేరుకొని శంషాబాద్ కు తీసుకువెళ్లారు. అనంతరం జేసీబీ సాయంతో గుంత తీసి పాతిపెట్టారు. కుక్కలు వెంబడించడంతో బెదిరిపోయిన జింక గ్రామస్తులు గుంపులు గుంపులుగా దాన్ని చూసేందుకు రావడంతో భయాందోళనకు గురై మృతి చెందినట్లు బీట్ ఆఫీసర్ సంతోష్ తెలిపారు.