టాప్‌లో నెపొంనెచ్చి రెండోస్థానంలో గుకేశ్‌, నకముర

టాప్‌లో నెపొంనెచ్చి రెండోస్థానంలో గుకేశ్‌, నకమురటొరంటో(కెనడా): ఫిడే క్యాండిడేట్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌గుకేశ్‌ 2వ స్థానానికి పడిపోయాడు. గురువారం జరిగిన 11వ రౌండ్‌ పోటీలో అమెరికాకు చెందిన ఫ్యాబినో కరోనాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో గుకేశ్‌.. నకమురాతో కలిసి సంయుక్తంగా 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రష్యా గ్రాండ్‌మాస్టర్‌ నెపొంనెచ్చి విదిత్‌ గుజరాతిని చిత్తుచేసి అగ్రస్థానానికి ఎగబాకాడు. 11వ రౌండ్‌ ముగిసిన అనంతరం నెపొంనిచ్చి 7పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గుకేశ్‌, నకముర సంయుక్తంగా 6.5పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో కోనేరు హంపి 5.5పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకగా.. ఆర్‌. వైశాలి 4.5పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.
11వ రౌండ్‌ ముగిసిన అనంతరం
పాయింట్ల పట్టిక
పురుషుల విబాగం..
1. నెపొంనెచ్చి(రష్యా) = 7.0 పాయింట్లు
2. హికారు నకమురా(అమెరికా) = 6.5 ,,
3. డి.గుకేశ్‌(భారత్‌) = 6.5 ,,
4. ఫ్యాబినో కరునా(అమెరికా) = 6.0 ,,
5. ఆర్‌.ప్రజ్ఞానంద(భారత్‌) = 5.5 ,,
6. విదిత్‌ గుజరాతి(భారత్‌) = 5.0 ,,
7. అలిరెజా ఫిరోజా(ఫ్రాన్స్‌) = 4.5 ,,
8. నిజత్‌ అబసోవ్‌(అజర్‌బైజాన్‌) = 3.0 ,,
మహిళల విభాగం..
1. టాన్‌ జోంగీ(చైనా) = 7.5 పాయింట్లు
2. లీ టింగ్జీ(చైనా) = 7.0 ,,
3. ఎ.జోర్యాకినా(రష్యా) = 5.5 ,,
4. కోనేరు హంపి(భారత్‌) = 5.5 ,,
5. కటెర్యానా లగ్నో(రష్యా) = 5.5 ,,
6. అన్నా ముచ్ఛోక్‌(ఉక్రెయిన్‌) = 4.5 ,,
7. ఆర్‌.వైశాలి(భారత్‌) = 4.5 ,,
8. ఎన్‌.సలిమోవా(బల్గేరియా) = 4.0 ,,