అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు వేగవంతం చేయాలి: బుర్ర వెంకటేశం

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో  అమ్మ ఆదర్శ పాఠ శాలలో పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సూచించారు.  భద్రాచలం పర్యటన తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం కలేక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తో కలసి అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి పై సమీక్షించారు.  ఈ సందర్బంగా విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలు నేపద్యంలో ఎన్నికల కమిషన్ విద్యాశాఖ ద్వారా జరిగే అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు మినహాయింపు ఇచ్చిందని జిల్లాలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని  సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 536 పాఠశాలలో 59 పాఠశాలల్లో పనులు పూర్తి అయ్యాయని మిగిలిన 337 పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు.