ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే నిజమైన ధనవంతులు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు
నవతెలంగాణ- కంటేశ్వర్
ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే నిజమైన ధనవంతులు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అంకం హాస్పిటల్ నిజామాబాద్ వారి సంయుక్త ఆద్వర్యంలో  జిల్లా ప్రజలకు నడక, పరుగు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఉదయం 7గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానం నుండి మామిడి పల్లి రైల్వే గేట్, (ఆర్మూర్ రోడ్) వరకు వెళ్లి తిరిగి వెనక్కి పాలిటెక్నిక్ మైదానం వరకు కొలతకు వచ్చిన 21కిలోమీటర్ల పరుగు పందెం( అంకం హెల్ ప్ మార్తాన్ ఓపెన్ కాంపిటీషన్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పోలిస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు  పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ..ప్రపంచంలో ధనవంతులు ఆంటే  డబ్బు ఉండడం కాదు ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారే నిజమైన ధనవంతులని అన్నారు.
ప్రతిరోజు నడక, పరుగు  చేస్తూ, మితంగా ఆహారం తీసుకుంటూ, ధూమ, మధ్య పానాలకు దూరంగా ఉంటూ,  తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఇటువంటి రన్ కార్యక్రమం నిర్వహించడం మన నిజామాబాద్ చరిత్రలోనే   ప్రప్రథమం అని ఈ రన్ కు 150 మందితో భారీ సంఖ్య లో అన్ని వయస్సుల వారు పాల్గొనడం ఎంతో ఉత్సాహంగా ఉన్నదని,    ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు,  అంకం హాస్పిటల్ సహకారం తో 21 కిలోమీటర్ రన్  నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డా. నీలి రాం చందర్,  డా. జలగం తిరుపతి రావ్ లు మాట్లాడుతూ.. ట్రాఫ్ఫిక్ సమస్యలు అంతరాయం కాకుండా సహకరించిన ట్రాఫ్ఫిక్ సీఐ చంద్ర రాథోడ్ మరియు పోలిస్ వారికి, అంబులెన్స్ వాహనాలు సమకూర్చిన రెడ్ క్రాస్ చైర్మన్  బుస్సా ఆంజనేయులు కి, రెడ్ క్రాస్ సిబ్బందికి, రన్ లో పూల వర్షం తో స్వాగతం పలికిన  చంద్ర టెక్ని స్కూల్ విద్యార్థులకు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కి, వాకర్స్ సంఘానికి, నుడా  చైర్మన్ ప్రభాకర రెడ్డి గారికి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ , ప్రొఫెసర్లు, మరియు విద్యార్థులకు, కార్యక్రమానికి విస్త్రుత ప్రచారం కల్పించిన మీడియా మిత్రులకు, పరుగులో పాల్గొన్న ఔత్సాహికులకు, వివిధ వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదములు  తెలిపారు.అనంతరం పరుగు పందెం లో  గెల్పొందిన  వారికి అంకం హాస్పిటల్ సహకారం తో మొదటి  ప్రైజ్  10000 వేలు మహేష్ కు, రెండవ  ప్రైజ్ 7000 వేలు భారత్ రాజ్ కు,  3. ప్రైజ్  5000 వేల రూపాయలు ఓంకార్ కు,  4.ప్రైజ్ 3000 వేల నరసయ్య కు  5. ప్రైజ్  = 1500 వందల  రూపాయలు రాంబాబు గార్లు మనీ ప్రైజ్ తో పాటు గోల్డ్  మెడల్స్ ను కూడ అంద చేశారు. ఈ రన్ పూర్తి చేసిన 80% వారికి కూడా మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు  డా. నీలి రాం చందర్,  డా. జలగం తిరుపతి రావ్ డా. చంద్ర శేఖర్ రెడ్డి, డా. అరవింద్ రెడ్డి, డా గోపాల్ సింగ్, డా నాగ మోహన్ రావు, డా రాఘవేంద్రరావు, డా ఆనంద్, డా అనిల్, డా కిరణ్, డా. శేషగిరిరావు, స్పాన్సర్లు డా. అంకం గణేష్, డా. భాను ప్రియా, డా గోవింద్ రావు, పోలిస్ సిబ్బంది,  రజినీశ్, మహేశ్, అభిషేక్, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.