– ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ
– మే డే పోస్టర్ల విడుదల
నవతెలంగాణ-కంటోన్మెంట్
బీజేపీ ప్రభుత్వ విధానాలను ఓడిద్దామనిఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం బోయిన్పల్లి మార్కెట్లో మే డే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 138 సంవత్సరాల క్రితం 8 గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ జరిగిన పోరాటంలో అనేకమంది కార్మికులు మతి చెంది వారి రక్తతర్పణంతో మేడే ఏర్పడిందన్నారు. దాని ఫలితంగానే మనదేశంలో ఎనిమిది గంటల పని విధానం అమలవుతుందని.. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి 12 గంటల వరకు పని చేయించే పద్ధతుల్లో చట్టాలను మార్పులు చేసిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేకత ప్రభుత్వాన్ని రాబోవు రోజుల్లో కార్మిక వర్గం ఓడించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.మే 1న వాడవాడలో ఏఐటీ యూసీ జండాలను ఘనంగా ఎగురవేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెం ట్ ఎన్ ఎల్లయ్య, ఉపాధ్యక్షులు బి సమ్మయ్య, కే ఐలయ్య, పి రాజు, కార్యదర్శులు డి రాజు, కొమురయ్య, కె కుమార్ తదితరులు పాల్గొన్నారు.