
రామకృష్ణాపురం గ్రామంలో హెరిటేజ్ పాల సేకరణ కేంద్రంలో పాలను ఉత్పత్తి చేసే రైతు సుబ్బురు ఆంజనేయులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ మృతి చెందారు. ఆ పాడి రైతు పాల సేకరణ కేంద్రం లోని హెరిటేజ్ డైరీ లో సభ్యుడై ఉన్నందున “రైతు ప్రమాద బీమా” క్రింద నామినిగా ఉన్న అతని భార్య సుబ్బూరి కళ్యాణి కి రూ.2,02500/- చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరీ జోనల్ హెడ్ సత్యనారాయణ మాట్లాడుతూ..పాడి రైతులకు అవగాహన సదస్సు కల్పించి పాడి పశువులలో మెలకువల గురించి తెలిపారు. సమీకృత పశువుల దాన .క్యాల్షియం. మినరల్ మిక్సర్ . నట్టల నివారణ బిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా హెరిటేజ్ డైరీ లో పాలు పోసే ప్రతి రైతుకు రెండు లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దానితోపాటు పాడి పశువులకు ప్రమాద బీమా అందుబాటులో ఉందన్నారు. హెరిటేజ్ నుండి మినీ డైరీ ఫార్మ్ లోన్లు 5 లక్షల నుండి 20 లక్షల వరకు మార్టి గేజ్ ద్వారా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి డైరీ రిజినల్ హెడ్ నర్సింగ్ రావు.హెరిటేజ్ భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ ఎలిమినేటి కిరణ్ . వెటర్నరీ అసిస్టెంట్ బాలరాజు తో పాటు రామకృష్ణాపురం హెరిటేజ్ పాల సేకరణ కేంద్ర అధికారి చింతల ఆంజనేయులు మరియు గ్రామ పాడి రైతులు 28 మంది పాల్గొన్నారు.