గీత మారని జీవనం.!

– లిక్కర్ దెబ్బకు గీత కార్మికులు విలవిల
– గీత వృత్తికి ఆదరణ కరువు
– అర్ధాకలితో అలమటిస్తున్న గీత కార్మికులు
నవతెలంగాణ – పెద్దవూర
ఒకప్పుడు కల్లుగీత వృత్తినినమ్ముకొని నాలుగు రాళ్లు సంపాదించుకున్న గీత కార్మికులు గత పదేళ్లుగా పూట గడవని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో మద్యం పుష్కలంగా లభిస్తుండడంతో ఆనారోగ్యాన్నిచ్చే మత్తు పదార్థాలకు ప్రజలు అలవాటు పడి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి వరప్రసాదమైనకల్లు సేవించేందుకు అనాసక్తి చూపుతున్నాడు. దీంతో వృత్తిని వదులుకోలేక భారపు ఆర్థిక పరిస్థితుల్లో గీత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. మండలంలో ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు 300 లకు పైగా ఉన్నాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చి సీజన్లో తాటి, ఈత కల్లును తీస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు మరో 50 మందికి పైగా ఉన్నారు. తాటి,ఈత చెట్టు పొలాల గట్ల మీద పెంచే వారి సంఖ్యా తగ్గతుండడం తో రోడ్డున పడ్డాయి.
2014 కంటే ముందు..
2014 కంటే ముందు ప్రతి మండలం లో ఒక వైన్ షాప్, నియోజకవర్గం లో ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ ఉండేవి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీ ఆర్ ఎస్ మొదటి సారి అధికారం వచ్చాక మండలానికో వైన్ షాపులు వెలిసాయి. మళ్ళీ రెండవ సారి అధికారం లోకి వచ్చాక మళ్ళీ మండలానికి ఒక వైన్ షాప్, నియోజకవర్గం లో రెండు బార్ అండ్ రాస్తారెంట్లు వెలిసాయి. మొత్తంగా టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లాలో ఏకంగా 300 వైన్ షాపులు పెరిగాయి.150 బర్ అండ్ రెస్టారెంట్లు పెరిగాయి. వాటితో పాటు ఈ పదేళ్ల కాలంలో ఒక్కొక్క గ్రామం లో 10 కంటే ఎక్కువ బెల్టు షాపులు వెలిసాయి. దాంతో కల్లు గీత కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
పెద్దవూర మండలం లో
మండలంలోని సంగారం,కొత్తలూరు, పెద్దపూర, పినపూర, తుంగతుర్తి పోతుకూరు, ఈదులగూడెం, పులిచర్ల, ఊట్లపల్లి, బసిరెడ్డిపల్లి, బోనూతల గ్రామాల్లో గీత కార్మిక కుటుంబాలున్నాయి. తాడి, ఈత చెట్లను నమ్ముకొని కుటుంబాలు ఈ జీవనం సాగిస్తున్నాయి. ఒకప్పుడు కనుచూపు మేరలో ఈతవనాలు కన్పించేవి. కానీ నేడు ఆ పరిస్థితి కన్పించడం లేడు కల్లుకు ఆదరణ తగ్గడంతో తాటి, ఈత వనాలు సైతం దశాబ్దాలకాలంగా ఉన్న తాటి, ఈత చెట్లు తొలగిస్తున్నారు. భూముల్లో అడ్డంగా ఉంటున్నాయని, వాటి నీడ పంట పాలాలపైకి వస్తుందని, దీంతో పంటలు సక్రమంగా పండటం లేదనే ఉద్దేశంతో రైతులు గట్లమీద తాటి, ఈత చెట్లుకు తొలగిస్తున్నారు. దీంతో భవిష్యత్లో ప్రకృతి వరప్రసాదమైన కల్లు చెట్టును ఎక్కే క్రమంలో గీత కార్మికులు అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు గాల్లో
కలిసిపోవాల్సిందే.
కార్మికులు దక్కని ప్రతిఫలం
ఎంత కష్టాన్ని సైతం లెక్క చేయకుండ తాటిచెట్లను ఎక్కి గీత గీస్తున్న వారికీ ప్రభుత్వ ప్రతిఫలం దక్కడం లేదు. ఈ వృత్తిని చేసేందుకు గీత కార్మికులు చాలా మంది అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో మండలంలో గీత కార్మికుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జీవనం గడవక కూలిపనికి వెళ్తున్నారు. మొదట్నుంచి ఉన్న వృత్తిని కోల్పోయి వేరే పనుల్లో నిమగ్నమౌతున్నారు. దీంతో వారి బతుకులు, వారి కుటుంబాలు వీధిన పడ్డాయి.
గీత కార్మికులకు పన్నుల మోత..
అర కొర సంపాదనతో కుటుంబాలు పోషించుకుంటున్న గీత కార్మికులకు పన్నుల మోత తప్పడం లేదు. వారి ప్రాణాలు వారి బతుకులకు భరోసా కల్పించడం లేదు.చెట్టు ఎక్కాలంటే గీత కార్మికులు చెట్టు చెట్టుకు పన్ను కట్టాల్సించే. ఒక్కో చెట్టుకు రూ.50 వరకూ చెట్టును బట్టి పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి మూడు నెలలకోసారి పన్నులు చెల్లిస్తున్నారు. అలా చెల్లించిన పన్నుల ఖర్చులు కూడా కల్లు తీయడం వల్ల రావడం లేదని వాపోతున్నారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. గత పదేళ్లుగా ఇబ్బందులు పడ్డ కల్లు గీత కార్మికులు ఈ ప్రభుత్వం లోనైనా వారిని తగిన విదంగా ఆడుకోవాలని కోరుతున్నారు. పలస నారయ్య, సంగారం
గీతవృత్తిని నమ్ముకొని 40 ఏండ్లుగా పని చేస్తున్నా గతంలో ఆదాయం బాగా ఉండేది.గత పదేళ్లు గా మద్యం షాపులు, వైన్ షాపులు పెరగడం తో ఇబ్బందులు పడుతున్నాము. అంతే గాక ఇప్పుడు గ్రామ గ్రామాన చెట్లను తీసేస్తున్నారు. దీంతో కల్లు రావడం తగ్గింది. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం లేదు. రోజుకు రూ. 200 నుండి రూ.300 రావడం లేదు.
గీత కార్మికులకు భరోసా కల్పించి ఆదుకోవాలి: దోసపాటీ బుచ్చిబాబు.. బోనూతల
రోజుకు రూ. 200 నుండి రూ.300 ఆదాయం మాత్రమే వస్తుంది. దాదాపు 10 నుండి 15 చెట్లు ఎక్కి దిగాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవాల్సిందే అలాంటి సమయంలో గీత కార్మికులకు గత ప్రభుత్వం ఏమి చేయలేదు.ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం మమల్ని అన్ని విధాలుగా అందుకోవాలని మాకు భరోసా కల్పించాలి