– కాకా ఆశయాలతో వస్తున్న అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదించండి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-గోదావరిఖని:
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజా ర్టీతో గెలిపించి బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ మహాసభ, కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ సన్నాహక సభ ఆదివారం గోదావరిఖనిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కోల్ బెల్ట్ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కార్మిక లోకం బీఆర్ఎస్కి బుద్ది చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. అదే విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరింత భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. స్థానికంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ వెంక టస్వామి కాక ఆశయాలతో వస్తున్నారని, వారిని ఆదరిం చాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేస్తామ న్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి.సంజీవ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతలరాజేష్తోపాటు కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.