సీపీఐ(ఎం) ను గెలిపిస్తే ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేస్తాం

– సీపీఐ(ఎం) పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్
– ప్రజాస్వామ్యం పరిరక్షణకు బీజేపీ కూటమిని ఓడించాలి
నవతెలంగాణ – చండూరు  
సీపీఐ(ఎం) ను గెలిపిస్తే ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేస్తామని సీపీఐ(ఎం) పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ అన్నారు. సోమవారం గట్టుపల్ మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే బీజేపీ కూటమినీ ఓడించాలని, ఈ పార్లమెంట్ ఎన్నికలలో సీపీఐ(ఎం) ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. 10 ఏళ్లు బీజేపీ పాలనలో కార్పొరేట్, మతోన్మాద విధానాలు బలపడ్డాయని, వీటికి వ్యతిరేకంగా నికరంగా పోరాడింది కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ అని చెబుతూ గుజరాత్లో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 15 శాతానికి పైగా పేదరికం పెరిగిందని వారు తెలిపారు.
ఈ మునుగోడు ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదల కోసం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, సాగునీరు, త్రాగునీరు కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన చరిత్ర సీపీఐ(ఎం) కు ఉందన్నారు. పార్లమెంట్లో వామపక్షాల బలం లేకపోవడం వలన ప్రజా సమస్యలు పక్కకు పోయి, కార్పొరేట్లకు ఉపయోగపడే విధానాలు ముందుకు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అయితగోని విజయ్ కుమార్, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకట రమణారెడ్డి, తుమ్మల పద్మ, మన్నే బిక్షం, పి శ్రీను, వల్గూరి శ్రీశైలం, బండారి కృష్ణయ్య, బండా నరేందర్, గిరి బిక్షం, కానుగుల నరసింహ, పోలే సత్యనారాయణ, జెర్రీపోతుల ధనంజయగౌడ్,కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, పెద్దగాని నరసింహ, తుకారం, ఎండి రబ్బాని, విశ్వనాథం, చెన్నయ్య, కర్నాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.