
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శ్రీ అనంత ఆంజనేయ స్వామి దేవాలయంలో నేడు జరిగే హనుమాన్ జయంతి వేడుకలకు స్థానిక కౌన్సిలర్ల, వీడీసీల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 15 క్వింటాళ్ల అన్నదానంతో జరిగే ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు సైతం పాల్గొంటారు.. ఇక్కడ 33 అడుగుల ఎత్తుతో ఏర్పాటుచేసిన హనుమాన్ విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.. స్థానిక కౌన్సిలర్లు మేడిదాల సంగీత రవి గౌడ్ ,ఆకుల రాము ,కోన పత్రి కవిత కాశిరాం, వీడీసీ ప్రతినిధులు లక్కారం శ్రీనివాస్ ,,,భూమిని రవి, సాజిద్ ,లక్ష్మణ్, ,రాజన్న తదితరుల ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాట్లను ముమ్మరం చేసినారు.