– రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు
విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని రోటరీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి అన్నారు. ఐటీసీ అనుబంధ సంస్థ రోటరీక్లబ్ ఆఫ్ ఇనభద్ర ఆధ్వర్యంలో (3150) డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి సారపాకలోని గాంధీనగర్లో ఉన్న శ్రీసత్యసాయి మోడల్ స్కూల్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా బూసిరెడ్డి శంకర్రెడ్డికి క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయంత్ కుమార్ దాస్, గోవిందరావులు పుష్పగుచ్ఛంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల పిల్లలకు రోటరీ గవర్నర్ చేతుల మీదుగా పాదరక్షలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బూసిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో క్లబ్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ బాధ్యులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.