– నేడు నాగర్ కర్నూల్‌లో సీఎం రేవంత్ పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఐదు సభల్లో పాల్గొనన్నారు. తొలుత మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కోడంగల్‌లో నిర్వహించే ఎన్నికల సభలో పాల్గొన్న అనంతరం, సాయంత్రం నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ప్రచారంలో పాల్గోంటారు. 24న సికింద్రాబాద్‌లో దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీ అనంతరం, సాయంత్రం వరంగల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 25న చేవెళ్ల నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే óబహిరంగ సభలో పాల్గొంటారు. 26న జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ రకంగా ఆయన నాలుగు రోజుల్లో మొత్తం ఐదు పార్లమెంట్ నియోజక వర్గాల్లో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.