వర్షానికి రోడ్డుపై నేలకూలిన భారీ వృక్షాలు

– జెసిబి సహకారంతో తొలగించిన ఎస్ఐ
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో సోమవారం వర్షంతో పాటు ఈదురు గాలులతో రామారెడ్డి నుండి కామారెడ్డి వెళ్లే రహదారిపై చెట్లు నేల కూలడంతో, సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కొండ విజయ్, ఏఎస్ఐ రవీందర్ బృందం జెసిపి సహకారంతో చెట్లను తొలగించి, రోడ్డును క్లియర్ చేయడంతో వాహనదారు, ప్రజలు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.