
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం ముగింపు పురస్కరించుకొని ఈ తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులని ఎండలో తిరగనివద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కుంటల్లో స్నానాలు చేయడానికి వెళ్లకుండా చూడాలన్నారు. ఈత రాకుండా చెరువులు కుంటలో స్నానానికి వెళ్లి ఎందరో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు.ఇంటి వద్ద తమ పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ తో ఆడకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు.అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాథోడ్ సాగర్, వీడిసి క్యాషియర్ పాలెపు రాజేశ్వర్, గడ్డం గోవర్ధన్, ఉపాధ్యాయులు లత, స్వరూపారాణి, స్వప్న, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.