నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న పతాని సురేందర్ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరిగే సైన్స్ సెమినార్ కు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేతనకుమారి మంగళవారం తెలిపారు. ఈనెల 26వ తేదీన ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జరిగే సైన్స్ సెమినార్లో “సైన్స్ ఎడ్యుకేషన్ రైసింగ్ భారత్” అనే అంశంపై “పాఠశాల ఆవిష్కరణలకు కేంద్ర బిందువు” అనే ఉప అంశం కింద సెమినార్లో పేపర్ ప్రజెంటేషన్ లో పాల్గొంటారని తెలిపారు.మా పాఠశాల ఉపాధ్యాయుడు రాష్ట్రస్థాయి సెమినార్ కు ఎంపిక కావడం సంతోషకరమని, ఈ సందర్భంగా సురేందర్ ను పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మాధవరెడ్డి, అనసూయదేవి గంగాధర్,రఘునాథ్,అశోక్, భాగ్యలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ తదితరులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.