రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

– పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్ 
నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి బుధవారం  నామినేషన్ వేస్తారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ సందర్భంగా ఉదయం 9 గంటలకు నల్లగొండ పట్టణం వీటి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో అభ్యర్థి రఘువీర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, బాలు నాయక్, కుందూరు జైవీర్ రెడ్డి,బత్తుల లక్ష్మారెడ్డిలు పాల్గొంటారని పేర్కొన్నారని తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం స్వామి వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో పార్టీ శ్రేణుల ఉద్దేశించి మంత్రులు, మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం 12:30 గంటలకు నామినేషన్ వేస్తారని తెలిపారు.నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీకి పార్టీ శ్రేణులంతా ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని సూచించారు.