
నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద శివారులో గల ఉద్యానవన క్షేత్రంలో గల మామిడి తోట బుధవారం వేలం నిర్వహించినట్లు హెచ్ వో రామకృష్ణ తెలిపారు. వేలంపాటలో ఏడుగురు పోటీ పడగా ఎల్లారెడ్డికి చెందిన గోరేమియా లక్ష ముప్పై ఏడు వేలకు మామిడి తోట సొంతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఏవో విజయ శేఖర్, ఏఈఓ శ్యామ్ సిబ్బంది ఉన్నారు.