
యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మధిర మల్లేశం కళాశాల ఫలితాలను ప్రకటించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అహర్నిశలు కృషిచేసిన అధ్యాపకులను అభినందించారు. కళాశాలకు వచ్చిన ఫలితాల పట్ల సంతోషం వ్యక్తపరిచారు. ద్వితీయ సంవత్సరం 1000 మార్కులకుగాను ఎంపిసి. విభాగంలో ఆమేషా బేగం 991 మార్కుల తో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు, బైపిసి విభాగంలో షిఫా అహ్మద్ 986 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. సిఇసి. విభాగంలో: సిహెచ్. నవ్వశ్రీ 968 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించారు. ఎం ఈ సి విభాగంలో సిహెచ్. వరుణ్ చారి 878 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు, ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ. విభాగంలో ఎస్, సాయికృతి 466/470 మార్కులతో రాష్ట్రస్థాయి లో 4వ ర్యాంకు సాధించారు.బి పి సి విభాగంలో సిఇసి మచ్చ భవ్యశ్రీ 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. సుమయ్య 485/500 మార్కులతో రాష్ట్ర స్థాయి, ర్యాంకు సాదించారు. ద్వితీయ సం॥లో 85 మంది విద్యార్థులు 900 లకు పైగా మర్కులు సాధించారు.ప్రథమ సంవత్సరమలో 90 మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా సాధించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ , అధ్యాపక బృందం ,విద్యార్థనీ, విద్యార్థులను అభినందించారు.