ఇంటర్ ఫలితాలలో జిజేసి ప్రభంజనం

నవతెలంగాణ – భీంగల్
గురువారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో భీంగల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం కొనసాగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో తుమ్మ సుప్రీకా 1000/ 955 మార్కులు సాధించి  టాపర్ గా నిలిచింది.  శ్రీపాద వైష్ణవి 1000/935  మార్కుల సాధించి  బైపీసీ విభాగంలో  టాపర్ గా  నిలువగా,  జుహానాజ్ 1000/911  సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ అబ్బా చిరంజీవి,  లెక్చరర్లు విద్యార్థులను అభినందించారు