– కొల్లూరి మల్లికకు డాక్టరేట్ ప్రదానం
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలపరిధిలోని బండరామారం గ్రామానికి చెందిన కొల్లూరి లింగమల్లు, పిచ్చమ్మల కుమార్తె కొల్లూరి మల్లిక కు రాజస్థాన్‌లోని”సన్ రైజ్ యూనివర్సిటీ’ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టరేట్ ప్రకటించింది. డాక్టర్ రమేష్‌కుమార్ పర్యవేక్షణలో చేసిన ‘ఏ క్రిటికల్ స్టడీ ఆఫ్ ఇంటర్‌వెల్ ట్రైనింగ్ ఎఫెక్ట్స్ ఆన్ వేరియస్ సర్ఫేసెస్ ఆన్ సెర్టైన్ ఫిట్‌నెస్ వేరియబుల్స్ రిలేటెడ్ టు పెర్ఫార్మన్స్ బిట్వీన్ కబడ్డీ ప్లేయర్స్’ అను పరిశోధన ఫలితాలను యూనివర్సిటీకి సమర్పించారు. వీటిని పరిశీలించిన అనంతరం యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌మెహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూ అనంతరం బోర్డు సభ్యులు మల్లికకు డాక్టరేట్‌ను ప్రకటించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మల్లిక తన పాఠశాల విద్యను పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు,ఇంటర్ తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు, డిగ్రీ తిరుమలగిరి ప్రగతి కళాశాల యందు పూర్తి చేశారు.అనంతరం బీపీఈడి ఓయూ దోమలగూడ యందు, ఎంపీఈడి కేయూ వరంగల్ నందు పూర్తి చేశారు.గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎన్‌ఐఎస్ కబడ్డీ కోచ్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు.ఐదేండ్ల నుండి ట్రైబల్ గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.కబడ్డీ క్రీడాకారిణిగా జాతీయ స్థాయిలో ఆడి ఎన్నో ప్రథమ, ద్వితీయ పథకాలను అందుకున్నారు. పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని నిరూ పించారు.వివాహ అనంతరం కూడా ఎన్నో కష్టాలను అధిగ మించి,పట్టుదలతో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డాక్టరేట్ సాధించి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన, మల్లికను కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, బంధుమిత్రులు పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ తన ఎదుగుదలకు సహకరించిన తన భర్త వెంకట్ యాదవ్‌కు, గైడర్ రమేష్‌కుమార్‌కు, ప్రొఫెసర్ డాక్టర్ రామ్ మెహ ర్‌కు, బోర్డు సభ్యులకు ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.