ఇంటర్‌లో ‘బాలిక’లదే హవా

– ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో రంగారెడ్డి రెండవ స్థానం
– ఫస్ట్‌ ఇయర్‌ 71.7శాతం, సెకండ్‌ ఇయర్‌ 77.63 శాతం ఉత్తీర్ణత
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బాలికల ఉత్తీర్ణత శాతమే అధికం
ఇంటర్‌ ఫలితాలను ఇంటర్‌బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఒకే సారి విడుదల చేసింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రంలో మేడ్చల్‌ 71.58 శాతం సాధించగా, రంగారెడ్డి 71.7 శాతం ఉత్తీర్ణత సాధించి రెండవ స్థానంలో నిలిచింది. సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 77.58 శాతం ఉత్తీర్ణతో రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఫలితాల్లో అత్యధికంగా బాలికలే ఉత్తీర్ణత సాధించారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవ త్సరంలో 71,297 మంది విద్యార్థులు పరీ క్షలకు హాజరయ్యారు. ఇందులో 71.1 శాతం 51, 121 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇం దులో బాలికలు 33,721 పరీక్షలకు హాజరైతే.. 76.74 శాతం 25,879 మంది ఉత్తీర్ణత సాధించారు. బా లురు 37,576 పరీక్షలు రాయగా 67.18 శాతం 23,516 మంది ఉత్తీర్ణులైయ్యారు. వికారాబాద్‌లో బాలురు 3,012 పరీక్షలు రాయగా 43.23 శాతం 1,302 మంది ఉత్తీర్ణులైయ్యారు. బాలికలు 3,443 పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 61.75 శాతం 2,126 మంది ఉత్తీర్ణత సాదించారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు
రంగారెడ్డి జిల్లాలో సెకండర్‌ ఇయర్‌ పరీక్షల కు బాలురు 33,859 మంది హాజరుకాగా 74.04 శాతం 25,069 మంది ఉత్తీర్ణులైయ్యారు. బాలికలు 30,900 మంది హాజరుకాగా 78 శాతం 25,204 మంది ఉత్తీర్ణత సాధించారు. వికారాబాద్‌లో బా లురు 3,010 మంది హాజరయ్యారు. ఇందులో 53.59 శాతం 1,613 మంది ఉత్తీర్ణత సాధించా రు. బాలికలు 3,446 మంది హాజరు కాగా ఇందు లో 61.42 శాతం 3,965 మంది ఉత్తీర్ణులై య్యారు.
అమ్మాయిదేపై చేయి…
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటర్‌ మెదటి, ద్వి తీయ సంవత్సరం ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శా తం సాధించిన దానిలో బాలికలు ముందు వరుస లో నిలిచారు. రాష్ట్రంలో మాదిరిగానే రంగారెడ్డి, వి కారాబాద్‌లో బాలికలు ఇంటర్‌ ఫలితాల్లో ముం దంజలో నిలిచారు.