టెస్లాలో ఆరు వేల మందిపై వేటు

న్యూయార్క్‌ : ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా తన టెక్సాస్‌, కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో పొదుపు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటం, ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్‌లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయిటర్స్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది.