
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఎర్లీ చైల్డ్ వుడ్ కేర్ అండ్ ఎడ్యు కేషన్ (ఈసీసీఈ) సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీడీపీఓ స్వర్ణలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులను పిల్లల బాగోగులు ఇతరత్రా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్య సంరక్ష, విద్య దినోత్సవం సందర్భంగా అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లు జరుగుతున్నాయని తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. ప్రైవెట్ పాఠశాల లకు దిటుగ అంగన్వాడీ కేంద్రాల్లో అట వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఎల్ కేజీ,యూకెజి లో నాణ్యమైన విద్య అందజేయడం జరుగుతుందని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రీ స్కూల్ అసైన్మెంట్ కార్డులను చిన్నారులకు అందజేసి, అక్షరాభ్యాసం చేయించారు. క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం సువర్ణ, అంగన్వాడీ టీచర్లు వనజా, అసిఫా, శారదా, ఐకెపి సిసి ఉదయ్, గ్రామ అధ్యక్షురాలు లక్ష్మీ తోపాటు తల్లులు తదితరులు పాల్గొన్నారు.