
చెక్ పోస్ట్ లో తనిఖీ చేయు నిఘా సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులు శంకరానంద్ మిశ్రా ఆదేశించారు. ఏవైనా ఎన్నికలకు సంబందించిన డబ్బు,మద్యం, గిఫ్ట్స్ తరలించినా వెంటనే అధికారులు సీజ్ చేయాలనీ సూచించారు. ఆయన గురువారం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని మందల పల్లి,అశ్వారావుపేట చెక్ పోస్ట్ లను ను తనిఖీ చేసారు.ఎన్నికలకు సంబందించిన పోటీ చేయు అభ్యర్థులు ఖర్చులు ఎప్పటికప్పుడు జమ రిజిస్టర్ లో నమోదు చేయాలనీ కోరారు. అనుమతులు పొందిన వాహనాలను మాత్రమే ప్రచారానికి ఉపయోగించాలని తెలిపారు. అనుమతులు లేకుండా అభ్యర్థులు సభలు, ర్యాలీలు నిర్వహించ రాదని,నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికలు చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సీ కార్పోరేషన్ ఈ డీ,ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నోడల్ అధికారి సంజీవరావు,స్థానిక తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ లు ఉన్నారు.