ఆర్మూర్‌లో గెలిస్తే ఎక్కడైనా గెలుస్తారు

– కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఓట్ల కోసమే ఇక్కడికొచ్చిండు
– ఎంపీ అర్వింద్‌ను పసుపు బోర్డు పేరుతో రైతులకు మోసం చేసిండు
– గ్రామాలలో రానియకుండా అడ్డుకున్నరు
– ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా
– ఆర్మూర్‌ ‌ప్రజలతో విడదీయరాని బంధం ఉంది
– బీఆర్‌ఎస్‌ ఎం‌పీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మర్యాదకు, మంచితనానికి మారు పేరు ఆర్మూర్‌ ‌ప్రజలు అని, ఇక్కడ సక్సెస్‌ అయితే ఎక్కడైనా సక్సెస్‌ అవుతారని, ఈ నియోజకవర్గ ప్రజలతో 30ఏండ్ల అనుబందం ఉందని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఆర్మూర్‌ ‌పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు ఏదో ఒక బందంను ఏర్పరుచుకొని ఆదరిస్తారని, 94లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిన…ఏ పార్టీలో పొత్తు పెట్టుకోలేదు. స్వంత ఖర్చులతో వాహనాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించి నా గెలుపుకోసం కృషి చేసిన ఘనత ఆర్మూర్‌ ‌ప్రజలది అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభంజనంలో కూడా చాల మంది అభిమానులు నన్ను గెలిపించుకోవాలని చేసిన ప్రయత్నంలో దాదాపు 34 ఓట్లు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. అదే స్పూర్తితో బాన్సువాడలో పోటి చేసి విజయం సాధించానని, బాన్సువాడలో పోటి చేయడానికి టికెట్‌ ఇస్తే ఇక్కడి వారు ఎంత బాధపడ్డారో తెలుసన్నారు. ఇక్కడి నుండి అభిమానులు ప్రతి రోజు ఉదయం 100 కార్లలో వచ్చి సాయంత్రం 5గంటల వరకు బాన్సువాడలో ప్రచారం చేసి నా గెలుపుకు కృషి చేసారన్నారు. చాలా మంది బాజిరెడ్డి బాన్సువాడలో గెలువడని, ఇక అయిపోయిందని చెప్పారని కానీ నాకు ధైర్యం ఇచ్చింది ఆర్మూర్‌ ‌ప్రజలని గర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉండి ఆర్మూర్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ను గెలిపించుకున్నానని అన్నారు.
ఆర్మూర్‌ ‌ప్రజలకు నాకు 20ఏండ్ల గ్యాప్‌ ‌వచ్చిందని బాన్సువాడ తర్వాత నిజామాబాద్‌ ‌రూరల్‌కు వచ్చానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి సన్నిహితునిగా ఉన్నానని, ఆర్మూర్‌ ‌పక్క నియోజకవర్గమే నిజామాబాద్‌ ‌రూరల్‌ అని ఎప్పుడు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ ‌రెడ్డితో కలిసి మాట్లాడేవాన్ని అన్నారు. కేసిఆర్‌ ‌నాపై నమ్మకంతో నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటి చేయడానికి అవకాశం కల్పించారని అన్నారు. పార్లమెంట్‌ ‌స్థానానికి ముగ్గురు పోటి చేస్తున్నారని కాంగ్రెస్‌ ‌నుండి జీవన్‌ ‌రెడ్డి, బిజేపి నుండి అర్వింద్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నుండి నేను పోటి చేస్తున్నాని అన్నారు. జీవన్‌ ‌రెడ్డికి నిజామాబాద్‌తో సత్సంబందాలు లేవని, కానీ బిజేపి, బిఆర్‌ఎస్‌ ‌తరపున నేను ఉన్నానని మా గురించి జిల్లా వాసులకు బాగ తెలుసన్నారు. జీవన్‌ ‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి నిజామాబాద్‌కు ఎప్పుడైనా వచ్చిండా. మన ప్రాంత ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఎప్పడు రాలే. ఎలక్షన్‌ ‌సందర్బంగా వచ్చి ఇప్పుడు తిరుగుతున్నాడని అన్నారు. బిజేపి నుండి అర్వింద్‌ ఉన్నాడని పార్లమెంట్‌లో దాదాపు 500పైన ఎంపిలు దేశవ్యాప్తంగా ఉన్నారని ఎవరైనా దేశంలో ఎంపిలపై దాడులు చేశార అని ప్రశ్నించారు. ఆర్మూర్‌ ‌పసుపు రైతులకు మోసం చేసినందుకు ఆర్మూర్‌ ‌ప్రాంతంలోని గ్రామాల్లో రావద్దొని జనం కొట్టారు. అందుకే గ్రామాలకు రాకుండా సోషల్‌ ‌మీడియాలో కనిపిస్తాడని అన్నారు. బిఆర్‌ఎస్‌ ఎం‌పి అభ్యర్థి గురించి మీకు తెలుసని అన్నారు. ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా గుర్తింపు ఉందన్నారు.