
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కంజర్ చిరంజీవి 40 మంచం పై నుండి కింద పడగ తలకు దెబ్బ తలిగి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం అమృతాపూర్ గ్రామంలో ఈ నేలా 21న రాత్రి మంచం మీది నుండి కింద పడగ అతని తలకు దెబ్బ తగలగానే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై మహేష్ వివరించారు. మృతుని భార్య శమంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.