హైదరాబాద్: కొత్త స్వాధీనాల కోసం రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఎరయ లైఫ్‌స్పేసెస్ వెల్లడించింది. ఈ మొత్తాన్ని లీజర్ టూరి జంలో వ్యయం చేసినట్లు తెలిపింది. దాదాపు రూ.3 కోట్లతో లొనవాలాలో లగ్జరీ స్టేకేషన్ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు పేర్కొంది. మోహాలిలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని శాటిలైట్ సిటీలోని అతిపెద్ద వాణిజ్య సముదాయాన్ని రూ.47 కోట్లతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇది ఆతిథ్య వ్యాపారాన్ని విస్తరించడంలో, వద్ధి సంభావ్య వ్యాపార ప్రాంతాలలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొంది.