అంగన్‌వాడీల హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది

– ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
అంగన్‌వాడీలకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్స్‌ చేసిన 20 రోజుల సమ్మె సందర్బముగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి టీచర్స్‌ రిటైర్డ్‌ మెంట్‌ బెనిఫిట్స్‌ స్కిం ద్వారా టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.1లక్షతో పాటు ఆసారా పెన్షన్‌, ఇస్తాంఅని హామీ ఇచ్చి యూనియన్‌ నాయకులు ముందు ఒప్పుకుని జీఓ విడుదల చేశారని, ఈనాటి ప్రజా పాలన అందిస్తున్నాం అనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల ఐసీడిఎస్‌ మెమో ప్రకారం ఈ నెల ఏప్రియల్‌ 31 నాటికి సర్వీస్‌ పూర్తీ చేసిన అంగన్వాడీ టీచర్స్‌ అందరిని పదవీవిరమణ చేయాలని, బెనిఫిట్స్‌ క్రింద టీచర్‌కు రూ.1లక్ష, ఆయాకు రూ.50వేలు ఇస్తాం అని సర్కులర్‌ విడుదల చేయడం దుర్మార్గం మని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన రిటైర్డ్‌ మెంట్‌ బెనిఫిట్స్‌ ఇచ్జే జీఓను అమలు చెయ్యా డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పోరాటం తప్పదని, సమ్మెకు అంగన్వాడిలు సిద్ధం కావాలి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి కంచర్ల జమలయ్య, అసోసియేసన్‌ జిల్లా అధ్యక్షులు గొనె మణి పాల్గొన్నారు.