– చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిదే గెలుపు
– కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-మర్పల్లి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ కాం గ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిదే గెలుపు అని కాం గ్రెస్ నాయకులు తమ్మలి సురేష్, మొరంగపల్లి సురేష్‌లు అన్నారు. మండలంలోని పట్లూర్ గ్రామంలో కాంగ్రెస్ అ భ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించా రు.ఈ సందర్భంగా వారు ఉపాధి హామీ కూలీలతో మా ట్లాడుతూ పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గతం లో అధికారంలో ఉన్నప్పుడు వలసలు నివారించేందుకు సొంత గ్రామాల్లో పనులు కల్పించాలనే సంకల్పంతో జాతీయ ఉపాధి హామీ పనులను తెచ్చిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు 10 ఏండ్లుగా ప్రజలను మోసం చేస్తూ వ చ్చాయని వారి మాటలు నమ్మి మరోసారి మోసపోకూడ దని చేయి గుర్తుకే ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపించా లని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమి టీ చైర్మెన్ సురేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.