వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలో గల మోగా గ్రామంలో ఆదివారం నాడు జరిగిన పెండ్లి శుభ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరై పెండ్లి నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట ఉమ్మడి మద్నూర్ మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెండ్లికి హాజరైన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు సన్మానించారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.