అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ సామాగ్రి చోరీ

– అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు
– దొంగల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
నవతెలంగాణ- భగత్ నగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 35 డివిజన్ సప్తగిరి కాలనీ ప్రాథమిక పాఠశాల ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని నగర ఇంజనీరింగ్ విభాగం చేపట్టింది . ఇది ఇలా ఉండగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మాణానికి సంబంధించి ఇటుకలు,ఇసుక తదితర సామాగ్రి ని పాఠశాల ముందు నిలువ ఉంచగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో వాటిని తమ సొంత నిర్మాణాలకు వాడుకోవడానికి దొంగతనం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసినా అధికారులు మిన్నకుండడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా దొంగలని గుర్తించి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.