సూసైడ్‌ నోట్‌ రాసి.. ప్రేమ జంట ఆత్మహత్య

సూసైడ్‌ నోట్‌ రాసి.. ప్రేమ జంట ఆత్మహత్య– ఇంట్లో ఒప్పుకోకపోవడమే కారణం..
నవతెలంగాణ-ఆత్మకూరు ఎస్‌
ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శని వారం రాత్రి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మం డలం తుమ్మల పెన ్‌పహాడ్‌ గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన గుండగాని సంజరు (25 ) అదే గ్రామానికి ఆవాస గ్రామమైన కృష్ణసముద్రం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలో ఉండే సల్లగండ్ల నాగజ్యోతి (21) గ్రామ శివారులోని కోట రాజేందర్‌రెడ్డి వ్యవసాయభూమిలో మోనోక్ట్రోపాస్‌ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకు న్నారు. ఆత్మహత్యకు గల కారణం పోలీసులు ఆరా తీయగా అమ్మాయి బ్యాగ్‌లో సూసైడ్‌ నోట్‌ లభించింది. దాని ప్రకారం.. నాగజ్యోతి, సంజరు. ఆరేండ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. వీరి ప్రేమ విషయం మూ డేండ్ల కిందటే అమ్మాయి ఇంట్లో తెలవడంతో ఆమె తండ్రి.. ఆమెతో వాదనకు దిగారు. దాంతో అప్పటినుంచి వారిద్దరూ విడివిడిగా ఉన్నారు. సంజరు సూర్యాపేటలో ఉంటూ వాటర్‌ ప్లాంట్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. నాగజ్యోతి ఇమాంపేట ప్రతిష్టా కాలేజీలో బీ ఫార్మసీ పూర్తి చేసి కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లోని నాగోల్‌ క్రాస్‌రోడ్‌లోని ఓ ప్రయివేట్‌ హాస్పిటల్‌లో పనిచ ేసింది. ఇప్పుడు సూర్యాపేటలోని ఓ ప్రయివేట్‌ హాస్పిటల్‌లో పనిచేస్తూ సనా కాలేజీలో ఎం ఫార్మసీ చదువుతున్నది. ఈ క్రమంలో మూడేండ్ల నుంచి తిరిగి వారిద్దరూ ప్రేమను కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరే లతారెడ్డి అమ్మాయి తండ్రికి వారి ప్రేమ సంగతి చెప్పారు. దాంతో ఆమె తండ్రి పలుమార్లు అమ్మాయిని కొట్టాడు. అమ్మాయి పాలోళ్లయిన సల్లగండ్ల అజరు, సల్లగండ్ల మల్లయ్య, సల్లగండ్ల శ్రీను, సల్లగండ్ల ఉప్పయ్య కొద్ది రోజుల కింద సంజరుతో గొడవపడి కొట్టారు. దాంతో మనస్తాపం చెందిన సంజరు, నాగజ్యోతి.. శనివారం రాత్రి తమ తమ ఇండ్లలో నుండి పురుగుల మందు తెచ్చుకొని పొలంలో తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారిద్దరి చావుకు కారణమయిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొని ఇద్దరూ సంతకాలు చేశారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం చేసి ఇరువురి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.