
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ 2023-2024 ఫలితాలలో స్థానిక కృష్ణవేణి పాఠశాల కు చెందిన ఎన్ .గంగోత్రి బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఎంపీసీ విభాగంలో మహమ్మద్ మోహిత్ పాషా, ఎం. దీక్షిత విద్యార్థులకు 470 మార్కులకు గాను 466 సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థులను పాఠశాల వ్యవహర్త జి.చంద్రశేఖర్ విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్కే. మహబూబ్ అలీ వైస్ ప్రిన్సిపల్ జి.మిల్కీ రాజు ఇంచార్జెస్ జి.స్వప్న, సిహెచ్. సరిత, ఉపాధ్యాయులు వి. శేఖర్, ఎస్ డి. తాజుద్దీన్, జి. భీష్మాచారి పాల్గొన్నారు.