నేడు స్టాండర్డ్‌ క్యాపిటల్‌ బోర్డు భేటీ

హైదరాబాద్‌ : ఆర్థిక సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న స్టాండర్డ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ బోర్డు ఏప్రిల్‌ 30న భేటీ కానున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటనను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ, రైట్స్‌ ఇష్యూ, ఏదైనా ఇతర మోడ్‌ ద్వారా ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్‌ సెక్యూరిటీల జారీని కూడా బోర్డు పరిశీలిస్తుందని ఆ వర్గాల సమాచారం. స్టాండర్డ్‌ కాపిటల్‌ విభిన్న శ్రేణి వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఆర్థిక సహాయాన్ని కోరుకునే వ్యాపారాల కోసం కంపెనీ సౌకర్యవంతమైన ఓవర్‌డ్రాఫ్ట్‌ ఎంపికలతో వ్యాపార రుణాలను పొడిగిస్తుందని పేర్కొంది.