10 ఫలితాలలో మెరిసిన నలంద విద్యార్థులు

నవతెలంగాణ – ఆర్మూర్

పట్టణంలోని మామిడిపల్లి నలంద హై స్కూల్ విద్యార్థులు మంగళవారం విడుదలైన  తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ జిపిఏ సాధించారు .తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో  డివిజన్లోనే 10 జిపిఏ సాధించిన లక్కారం తనుశ్రీ (10/10)నీ నలంద యాజమాన్యం ప్రసాద్, సాగర్ శాలువా పుష్పగుచాలతో సన్మానించి అభినందించారు.. అలాగే నోవిక (9.7), వర్శిత్ (9.5), అక్షయ (9.3), కీర్తన (9.3),ఇందు(9.3), అయేషా(9.2), లిఖిత్ (9.2) మరియు పావని(9.0) ఉత్తమ GPA సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెన్ట్ ప్రసాద్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా 100% ఉత్తీర్ణత సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ నలంద హై స్కూల్ అని తెలియజేశారు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు …చదువుతోపాటు సంస్కృతి ,సాంప్రదాయాలను నేర్చుకొని బావి భారత పౌరులుగా మార్చే ప్రయత్నం లో అధ్యాపక బృందం తోడ్పడతారని తెలిపారు. ప్రిన్సిపాల్ సాగర్ మాట్లాడుతూ   తమ పాఠశాల విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిగా నేటి సమాజానికి అనుగుణంగా  తీర్చిదిద్దుతామని తెలిపారు. మంచి GPA సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు నలంద యాజమాన్యానికి అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.