శ్రీ విద్యాసాయి విద్యార్థుల విజయకేతనం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రం శివారులోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు మంగళవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు.పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.32 మంది విద్యార్థులలో 26 మంది విద్యార్థులు 9 జిపిఏ పైగా సాధించారు. పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు వంగరి శర్వాణి, సున్నం శ్రీనిధి,  పూజారి హర్షిత్ 9.8 జిపిఏ సాధించి పాఠశాల టాపర్లుగా నిలిచారు. ఏడుగురు విద్యార్థులు 9.7, ఐదుగురు విద్యార్థులు 9.5, నలుగురు విద్యార్థులు 9.3, ఒక విద్యార్థి 9.2, ఆరుగురు విద్యార్థులు 9, ముగ్గురు విద్యార్థులు 8.8, ఇద్దరు విద్యార్థులు 8.7, ఒకరు 8.3 జిపిఏ సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి తెలిపారు. పాఠశాల టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులను అభినందించి శాలువాతో  సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.