అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని వ్యక్తి మృతి

నవతెలంగాణ – పెద్దవూర
అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని పాలేరు మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలం లో సోమవారం వారం మృతి చెందిన సంఘీటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పెద్దవూర ఎస్ ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం మండల లోని నీమానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పూల్య తండా కు చెందిన ధనావత్ బిచ్చు (62 ) అను అతడు అదే గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరబావి తండాకు చెందిన అంగోతు స్వామి అను అతని వద్ద జీతం ఉంటూ పాలేరుగా జీవిస్తున్నాడు. ఈ నెల 29 సోమవారం సాయంత్రం బిచ్చు ఇంటి నుండి వెళ్లి ఊరబావి తండా శివారులోని వరద కాలువ పక్కన చెట్టుకు ఎలక్ట్రికల్ వైర్ తో ఉరి వేసుకుని చనిపోయిఉన్నారు. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన వారు అటువైపు వెళ్తూ గమనించి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  మృతుడి మృత దేహాన్ని చూసి సాగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి మరణం లో అనుమానం ఉందని కుటుంబ సభ్యులు తెలుపగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు  ఒక కుమార్తె కలరు.