– ఉచిత వైద్య శిభిరంలో ఏఎన్ఎం అనిత సూచన
నవతెలంగాణ – బెజ్జంకి
మారుతున్న జీవన ప్రమాణాలకనుగుణంగా ప్రజలను పౌష్టికాహారంపై శ్రద్ధ వహించాలని..మానసిక ఒత్తిడికి లోనవద్దని ఏఎన్ఎం అనిత సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయంలో ఏఎన్ఎం అనిత అధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత రక్త ప్రసరణ, మధుమేహం వ్యాదుల నిర్దారణ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆశా కార్యకర్తలు సౌమ్య, రేణుకా, రజని, రజిత, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.