
కాంగ్రెస్ పార్టీ చండూరు మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పుల్లెంల గ్రామానికి చెందిన సీత రాహుల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబందించి మంగళవారం మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృధ్ధికోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి,రాష్ట్ర సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ ,మండల అధ్యక్షుడు కోరిమి ఓంకారం, మాజీ అధ్యక్షుడు కోడి గిరిబాబు కు ధన్యవాదాలు తెలిపారు.