
నవతెలంగాణ – మునుగోడు
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామాలలో ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను తో ప్రజలకు అవగాహన కల్పించి ప్రచారం నిర్వహించాలని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి చామల వాసుదేవ రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని చల్మెడ గ్రామంలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి జితేందర్ రెడ్డి నివాసంలో కార్యకర్తలతో కలిసి ప్రచార తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుమారుడు గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒకరిని కాపాడుకునే బాధ్యత మాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు జంగిలి నాగరాజు, మండల కాంగ్రెస్ నాయకులు పగిల శ్రీరాములు, కొంక శంకర్, ఉప్పసర్పంచ్ గాదపాక యాదయ్య , కర్నాటి రామ కృష్ణ తదితరులు ఉన్నారు.