ఇచ్చిన హామీలను అమలు చేస్తాం..

– భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ని గెలిపించాలి
– బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
– అధిక సంఖ్యలో కాంగ్రెస్‌లోకి వలసలు
– ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌ రెడ్డి
ఊరుకొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తుందని.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రథóమ లక్ష్యమని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన సుమారు 40 మంది బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇప్పపాడు గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించి అధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం పార్టీ అహర్నిశలు కష్టపడుతుందని తెలిపారు. గ్రామానికి చెందిన కొంతమంది టిఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ లో చేరారు. జగినా లపల్లి గ్రామంలో అమ్మపల్లి తండాకు కొంతమంది రోడ్డుకు అడ్డంగా గోతులు తీసి రాకపోకలు నిలిపి వేశారని తండావాసులు ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్ల డంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఈ రోడ్డును బిటిగా మారుస్తామని హామీ ఇచ్చారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం తోని అభివద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. నర్సంపల్లి, గుండ్లకుంటపల్లి, ఊరుకొండ పేట గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు పదుల సంఖ్యలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఊరుకొండ, ముచ్చర్లపల్లి, బొమ్మరాజు పల్లి, జగబో యినపల్లి గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.