కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలబడండి

– కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలా శ్రావణ్‌రెడ్డి
– మండలంలో విస్తృతంగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-కొత్తూరు
పార్లమెంట్‌ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని మల్లాపూర్‌, మల్లాపూర్‌తండా, గూడూరు, మక్త గూడ గ్రామాల్లో ఆమె పర్యటించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గొంగల్లా హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో గ్రామాల్లో వారికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతి గుర్తుకు ఓటేసి వంశీ చంద్‌రెడ్డి గెలుపునకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. బీజేపీ హయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నం టాయ న్నారు. నిత్యవసర ధరలు సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ చిర్రా సాయిలు, గూడూరు ఉపసర్పంచ్‌ దయానంద్‌ గుప్తా, నాయకులు రాందాస్‌ నాయక్‌, దయ్యాల మల్లేష్‌, మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, చిర్ర నరసింహ, గ్రామ కమిటీ అధ్యక్షులు బల్వంత్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి, హరి ప్రసాద్‌ రెడ్డి, చిర్ర భుజంగం, భీమయ్య, సోలి పేట రఘు, చిర్ర రమేష్‌, చిర్ర పెంటయ్య, చిర్ర శ్రీను, కుమ్మరి శీను, కుమ్మరి రమేష్‌, శ్రీధర్‌ రెడ్డి తదితరులున్నారు.