నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్స్ విజయశంఖారావం పూరించాయి. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏడుగురిలో ఒకరికి పదికి పది జీపీఏ వచ్చిందని తెలిపారు. 12.5 శాతం మంది విద్యార్థులకు పదికి పది జీపీఏ సాధించారని పేర్కొన్నారు. 32,135 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఏ గ్రేడ్ సాధించారని వివరించారు. సబ్జెక్టుల వారీగా 19,224 మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారని తెలిపారు. పదికి పది జీపీఏ, 9.8 ఆపైన సాధించిన విద్యార్థులు 1,707 మంది, 9.5 జీపీఏ ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 43 శాతం ఉన్నారని పేర్కొన్నారు. 9.0 జీపీఏ ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 65 శాతం ఉన్నారని తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన బ్రాంచీలు 65 శాతం ఉన్నాయని వివరించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను తమ రోజువారీ సిలబస్‌లో భాగంగా బోధించడం ద్వారా నారాయణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. నారాయణ సీవో, స్పార్క్, ఒలింపియాడ్, ఈ-టెక్నో, మెడిస్పార్క్ ప్రోగ్రామ్‌లతో బోధించడం కారణంగానే ఘనవిజయాలను సాధిస్తున్నామని తెలిపారు.