నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో కామ్రేడ్ కందాల రంగారెడ్డి ముఖ్య అనుచరుడైన సప్పిడి చిన్న మల్లారెడ్డి స్మారకార్థం బుధవారం స్థూప ఆవిష్కరణ చేశారు.నేలపట్ల గ్రామంలో సప్పిడి చిన్న మల్లారెడ్డి ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తానని మనుమరాలు కామ్రేడ్ హర్షా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర నాయకులు ఫైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. ఎర్రజెండా పక్షాన పోరాటం చేసిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. అనంతరం ఫైళ్ల ఆశయ్య పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మండల కార్యదర్శి గంగదేవి సైదులు మండల కార్యదర్శి వర్గ సభ్యులు తడక మోహన్ నేత మాజీ ఎంపీటీసీ బత్తుల శంకరయ్య గౌడ్ మాజీ సర్పంచ్ తడక రామాంజనేయులు నాయకులు కొండే శ్రీశైలం,సప్పిడి రాంరెడ్డి,బుట్టి కృష్ణ,గుర్రం కృష్ణ,గుర్రం ప్రమోద్ సప్పిడి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు జంగారెడ్డి,సప్పిడి భాస్కర్ రెడ్డి,సప్పిడి మల్లారెడ్డి సతీమణి,కూతుర్లు మనుమలు, మనమరాలు పార్టీ కార్యకర్తలు,కళాకారులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు.