– ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా పార్టీ గెలిపి లక్ష్యంగా పయనించే విధంగా గ్రామాల్లో కష్టపడాలి కార్యకర్త
– కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
– ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి ప్రచారం చేపట్టాలి
నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని సత్యపల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్ తో కలిసి మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ను మన మహబూబాద్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. బలరాం నాయక్ ఎంపీగా గెలిస్తే అక్కడ దేశ ప్రధాని రాహుల్ గాంధీకి ఓటు వేసినట్లే అని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా గ్రామాలలో కలిసికట్టుగా ఉండి ప్రతి గడపగడపకు వెళ్లి గ్యారంటీలను చూపించి ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు ప్రజల్లో ఉండాలని అన్నారు. ఒక లీడర్ తలచొక్క వేసుకొని మండల జిల్లా కేంద్రాల్లో తిరుగుతే లాభం లేదని గ్రామాల్లోనే ఉండి ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ఓటు వేయాలని అభ్యర్థించినప్పుడే ఆ గ్రామంలో లీడర్ షిప్ కు విలువ ఉంటుందని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇతర పార్టీల అభ్యర్థులు వారికి గతంలో కొంత పరిచయాలు ఉన్నాయని వారికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓట్లు పడేవిధంగా కష్టపడాలి అని అన్నారు. కష్టపడ్డ వ్యక్తికి గుర్తింపు వస్తుందని ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ప్రతి కార్యకర్తను అన్ని రంగాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపాడు. ఏ గ్రామంలో ఎక్కువ లీడ్ వస్తే ఆ గ్రామానికి ఆ కార్యకర్త కష్టపడ్డా ఫలితం ఉంటుందని అన్నారు. ఫోటోలో ఫోజులు కాకుండా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించే విధంగా కార్యకర్త సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.