
– గాంధీజీ స్టేట్ ర్యాంకర్స్ ను అభినందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – చండూరు
తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో చండూరు మున్సిపాలిటీకి చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టేట్ మొదటి ర్యాంక్, స్టేట్ రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మునుగోడు క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు శాలువాలు కప్పి, మెమొంటోళ్లను అందించి ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో 10/10 జిపిఎ సాధించిన ఐదుగురు విద్యార్థులు పాలకూరి దృవిత, కారింగు నిఖిల్ కుమార్, మేకల చందన, వట్టి రక్షిత, బోడ శ్రీవిద్య 9.8/10 జిపిఎ సాధించిన సయ్యద్ అయేషా అంజూం, మురారి శెట్టి శ్రీ తేజస్విని, గంజి అనూష, గొంది స్రవంతి, భూతరాజు చంద్రస్మిత, ముంజంపల్లి చరణ్ ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చదువుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యధిక మంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించడం మునుగోడు నియోజకవర్గానికి గర్వకారణమని, ఈ విద్యార్థులందరూ భవిష్యత్తులో బాగా కష్టపడి చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా తయారై భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశించారు. ప్రతి సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తున్న గాంధీజీ విద్యాసంస్థల యాజమాన్యంను, ఉపాధ్యాయ బృందంను అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ చెరుపల్లి రామయ్య, ఏ ఎస్ ఎన్ మూర్తి, బంధనాదం సురేష్, దోటి వెంకన్న, అనంత చంద్రశేఖర్, నల్లగంటి మల్లేష్, గండూరి జనార్ధన్, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.