
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం డీన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 28 నుంచి 30 వ తేదీ వరకు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీల్లో కళాశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. ఈ పోటీల్లో మహిళల డబుల్స్ విభాగంలో అమృత వర్ష,యమున ద్వితీయ స్థానం, సింగిల్స్ విభాగంలో హలావత్ చిన్నారి తృతీయ స్థానం కైవసం చేసుకున్నట్లు చెప్పారు.అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో అబ్రహాం, చంద్రశేఖర్ లు తృతీయ స్థానం దక్కించుకొని తమ సత్తా చాటారు అని పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయిలో పోటీల్లో శిక్షణ పొందిన క్రీడాకారుల తో కళాశాల విద్యార్ధులు పోటీ పడి తమ ప్రతిభ కనబరచడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి, పీడీ రహ్మాన్ ఉన్నారు.