
నవతెలంగాణ – మల్హర్ రావు
దేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన క్షణంలోనే ఉపాధిహామీ కూలీలకు పని దినాలతోపాటు రోజువారీ కూలి పెంపుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో విభాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణతో కలసి గురువారం మంథని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖిగా మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పనిదినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాలో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఏమైనా సమస్యల ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గడ్డం వంశీకృష్ణ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద నిధులు తగ్గించాడు, తప్ప కనీసం పని దినాలు కూడా పెంచలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేస్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400 రూపాయలకు పెంచుతామన్నారు. మంత్రి దుద్దిళ్ల ఆశీర్వాదంతో ఇక్కడ నిరుద్యోగ సమస్యను పరిస్కారం చేస్తామన్నారు. అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన కోసం5 న్యాయ గ్యారంటీలైన రైతులందరికీ కనీస మద్దతు ధర, ఉపాది హామీ కూలీలకు రోజుకు రూ. 400 పెంపు, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా లక్ష రూపాయలు, రూ. 25 లక్షల వరకు క్యాష్ లెస్ వైద్య సాయం అందేలా హెల్త్ స్కీం, నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యగాల కల్పన అనే పథకాలను ప్రవేశపెట్టారని వాటిని కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలతో మరియు నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. స్వర్గీయ శ్రీపాద రావు, కాక వెంకటస్వామి చాలా మంచి స్నేహితులన్నారు. అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు.