జిల్లాలో రెడ్ అలర్ట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు

– ఏడు ప్రాంతాలకు పైగా  46 డిగ్రీలుగా నమోదు
– మరో 13 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగానే
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
భానుడి ప్రతాపంతో జిల్లా భగ్గుమంటోంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలో గురువారం  రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లాలోని అనుముల, నాంపల్లి, మాడుగులపల్లి, చందంపేట, కట్టంగూర్, పెద్దవుర, త్రిపురారం మండలాలలో 46 డిగ్రీల   కు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా  మునుగోడు , దామరచర్ల, చండూరు, కనగల్, పెద్ద అడిశర్లపల్లి,  కేతేపల్లి, గుర్రంపోడు, నకిరేకల్, అడవిదేవులపల్లి, దేవరకొండ,చిట్యాల, హాలియా, నిడమనూరు , మండలాలలో 45  డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు  కావడం గమనార్హం. ఈ ప్రాంతాలన్నీ కూడా రెడ్ జోన్ తలపిస్తూనాయి. జిల్లా అంతటా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావ డం తో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యు నీపునులు   పలు సూచనలు చేస్తున్నారు.
నిప్పుల కొలిమి..
నిప్పుల కొలిమిని తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 9గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రెండు రోజులుగా ఎండల ప్రభావం మరింత పెరగగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ, వడగాలులతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరో నెల పాటు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని తెలుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని మరికొన్ని  ప్రాంతాలు  ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోద వుతుందని తెలుస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ సూర్యుడు మండిపోతుండడంతో రోజువారీ కూలీలు, నిత్యం పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు తట్టుకోలేకపోతున్నారు. కార్మికులు, కూర గాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు వేడి నుంచి ఉపశమనం కోసం నానా పాట్లు పడుతున్నారు. అనే కమంది వడదెబ్బ బారిన పడుతున్నారు.
ఉష్ణోగ్రత వివరాలు..
వివిధ మండలాలలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనుముల, నాంపల్లి లో 46.6, కేతపల్లి, చందంపేట, మాడుగుల పల్లి  46.2, త్రిపురారం, మునుగోడు, పెద్దవూర, నల్లగొండలో 46 డిగ్రీలు,  కట్టంగూరులో 46 డిగ్రీలు, దామరచర్ల, చండూరు 45.9, వేములపల్లి  45.8, కనగల్ 45.7, నాంపల్లి 45.6,  నకిరేకల్, పెద్ద అడిషర్ల పల్లి, నిడమనూరు లో  45.6, గుర్రంపోడు, చందంపేట  45.4, త్రిపురారం 45.3, అడవి దేవులపల్లి, చిట్యాల, దేవరకొండ లో  45.1, నిడమనూరు, హాలియాలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.మిగతా ప్రాంతాలలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది.